ప్రపంచంలో అనేక దేశాల్లో కరువు, ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు కారణమైన ఎల్‌నినో చివరి దశకు చేరుకుంది. గతేడాది అక్టోబరు నాటికి తీవ్రస్థాయికి చేరిన ఎల్‌నినో తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. వచ్చే నెల తొలి వారం నాటికి తటస్థ పరిస్థితులకు చేరుకోనుంది. ఈ విషయాన్ని అమెరికా వాతావరణ అంచనా కేంద్రం తాజా నివేదికలో పేర్కొంది. ఎల్‌నినో కథ ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అటు ఆస్ట్రేలియా, ఇటు అమెరికా వాతావరణ శాఖల నివేదికలను భారత్‌కు చెందిన ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ విశ్లేషించి తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం జూలై తర్వాత పూర్తిస్థాయి లానినా పరిస్థితులు ఏర్పడనున్నాయి.