మైనింగ్‌ను అక్రమంగా దోచేందుకే ప్రత్తిపాడు నియోజకవర్గంపై వైసీపీ నాయకులు కన్నువేశారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వ రంలో ఆదివారం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ప్రత్తిపాడు మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్‌నూ తరలించుకుపోతున్నారన్నారు. మాఫియా డాన్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తమ్ముడు లంపకలోవలో ఉన్న వీరభద్ర కంపెనీకి అనువుగా రోడ్డు, బ్రిడ్జి నిర్మించుకున్నారుకానీ నియోజకవర్గంలో ఉన్న రోడ్లను, ప్రజల సమస్యలను నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఏలేరు ప్రాజెక్టు, సుబ్బారెడ్డిసాగర్, చంద్రబాబు సాగర్‌లను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే వంతాడ అక్రమ మైనింగ్ ఆపు తానన్నారు. పెద్దమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మం డలాన్ని ఏర్పాటుచేసి గిరిజనులకు మేలు చేస్తానన్నా రు. 72 ఎయిడెడ్ స్కూల్స్, కళాశాలలను తీసేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. ఎయిడెడ్ పాఠశాలలను కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామన్నా రు. కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు అండగా ఉంటానన్నారు. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్యచేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు సీఎం ప్రాధాన్యం ఇవ్వడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. జగన్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్‌ను ఓటర్లు నిలదీయాలన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్యారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నీడను కూడా ప్రత్తిపాడుపై పడనీయబోయనని స్పష్టంచేశారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కార్పొరేషన్‌కు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ, గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షు డు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నిత్యపోరాటయోధుడు పవన్‌కల్యాణ్ నీతికి నిలబడే వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మీసాల రాజు, గాటా బాలుదొర, బాబి తదితరులు పాల్గొన్నారు.