ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మే 13న పోలింగ్ జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ముగిసింది.నియోజకవర్గంలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2,705 నామినేషన్లను ఈసీ ఆమోదించింది. 25 ఎంపీ స్థానాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందాయి.