పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అఫిడవిట్ లోతప్పులు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె. వి. ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి శాంతమ్మతో కలసి మంత్రి మాట్లాడుతూ సవితమ్మపై ఏసీబీ, సిబిఐ స్ధాయి కేసులు, అక్రమ రవాణా, దౌర్జన్యం, బెదిరింపులు, గృహ హింస, చీటింగ్, దొంగతనం, పోర్జరీ, 420 కేసులు ఉన్నాయని తెలిపారు.