టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా మంగళవారం కొండపి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కొండపి సెగ్మెంట్ లోని మండల కేంద్రమైన మర్రిపూడికి ఆయన హెలికాప్టర్‌లో చేరుకొం టారు. ఆరు గంటల వరకు అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. టీడీపీ యువనేత దామచర్ల సత్య ఆధ్వర్యంలో అందుకు ఏర్పాట్లు జరుగుతు న్నాయి. మర్రిపూడిలో కార్యక్రమం అనంతరం బాలకృష్ణ రోడ్డు మార్గాన కాటూరివారిపాలెం, చీమకుర్తి మీదుగా సంతనూతలపాడు చేరుకుం టారు. అక్కడ రోడ్డుషో, సభలో పాల్గొంటారు. రాత్రికి ఒంగోలులో బస చేస్తారు. సంతనూతలపాడులో బాలకృష్ణ సభకు సంబంధించి అక్కడి టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సంతనూతలపాడు చెరువు వెలుపల మైనంపాడు డొంక నుంచి భారీ బైక్ ర్యాలీతో బాలకృష్ణకు స్వాగతం పలకనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa