ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు తీసుకునే వాడు కాదు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. భూములపై సమగ్ర సర్వే చేయించి.. వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వే జరగలేదు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదు. ఆ సర్వే లేక భూములన్నీ సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలు సరిగ్గా లేక అమ్ముకోడానికి కొనుక్కోడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టు తిరుగుతూ, డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద సంపూర్ణ హక్కు ఇవ్వాలని ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించామని సీఎం వివరించారు. 59 నెలల్లో విప్లవాత్మక పాలన చేయడంతో చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తోంది. మీ వైయస్ జగన్ మంచి చేశాడని చంద్రబాబుకు కోపమొస్తుంది’’ అని సీఎం వైయస్ జగన్ ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa