వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. రేపు శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురంలో స్టీమెర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ని క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి పామూరు బస్ స్టాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారని తలశిల రఘురాం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa