ప్రజలు మోసపూరిత మాటలు నమ్మద్దని గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం కవుతరం గ్రామ 1వ వార్డ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానులు ఆయనపై పూల వర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్-6 పథకాలు ప్రజలకు అందేందుకు సర్వదా కృషి చేస్తామని తెలిపారు. జగన్ పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని తెలిపారు. సంతోషం కావాలి అనుకుంటే టీడీపీ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కవుతరంగ్రామ ప్రజలు, గుడ్లవల్లేరు మండలం టీడీపీ శ్రేణులు, గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa