వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో ఉన్న పామూరు బస్‌స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa