ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్‌దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అసలు తమకు పెన్షన్ అందుతుందా లేదా అనే ఆందోళనలో పెన్షన్‌దారులు ఉన్నారు. ఈ క్రమంలో పెన్షన్‌దారులు ఇబ్బందులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులను వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ అధికారి ప్రజలకు మేలు చేసే అవకాశాలను కనీసం కూడా ఆలోచించడం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరం, అత్యంత దుర్మార్గమని లేఖలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa