భూ పట్టా చట్టంపై ప్రతిపక్షాలు బురదజల్లడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చట్టం రావడం భూకబ్జాదారులకు ఇష్టం ఉండదన్నారు.ఇది భూములను రక్షించే చట్టం అయితే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని, ఇది ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో బదలాయించారని, ఇలాంటి అరాచకాలు మళ్లీ జరగాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. ఇలాంటి వారు భూ పట్టా చట్టంపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.