పేరూరు ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన ప్రతి రైతుకు నేటి ధరలతో పరిహారం ఇస్తామని రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రామగిరి మండలంలోని పేరూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు తెస్తానని గొప్పలు చెప్పిన వ్యక్తి, వర్షానికి డ్యాం నిండితే గేట్లు ఎత్తి రైతుల పొలాలకు నీరు విడుదల చేయలేకపోయారని విమర్శించారు.