సీఎస్ పురం మండలం నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు తెల్లవారుజామున నుంచి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో భక్తులు తమమొక్కుబడులను తీర్చుకున్నారు. గోమాతకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజారులు భక్తులను ఆశీర్వదించారు. దేవస్థాన కమిటీ వారు భక్తులకు ప్రసాదాలను అందజేశారు.