నేడు విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. కోల్‌కత్తాలో 1861, మే 7న దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవీ దంపతులకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. ఆయన ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు.