ప్రధాని నరేంద్ర మోదీ అనకాపల్లి ఎన్నికల సభలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకపోవడం దారుణమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఆక్షేపించారు. ఉత్తరాంధ్రా ప్రజల సెంటిమెంట్ ను ప్రధాని మోదీ గౌరవించలేదని... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని మోడీ చెప్పకపోవడం ఉత్తరాంధ్రవాసులు నిరాశ కలిగించందని తెలిపారు. టిడిపి కూటమికి ఓటు వేయడం అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించినట్టేనని ఎమ్మెల్యే అదీప్ రాజు తేల్చిచెప్పారు. చంద్రబాబు నాయుడు ఎవరితోనైనా అబద్ధాలు చెప్పించగలరని... గోవాడ షుగర్ ఫ్యాక్టరీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసింది తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో అవాస్తవాలు మాట్లాడించారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి పెరిగిందని ఎమ్మెల్యే అదీప్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa