చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఐదేళ్ల పాటు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ హయంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడు జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు. పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఊసు కూడా మోదీ ప్రస్తావించలేదని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వెళ్తున్న కూటమిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు ప్రెస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. తనకు అధికారం రాదని తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుతూన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఎవరు మొగుడు అవుతారో చంద్రబాబుకు తెలుస్తుంది. ల్యాండ్ టైపింగ్ యాక్ట్‌ను అసెంబ్లీలో స్వాగతించింది టీడీపీ. రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే భూములను అధికారులు అప్పగించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడ్డం తగదు’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa