రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షం వ్యవహరిస్తుంది.చంద్రబాబు కోసం పని చేస్తోన్నట్లుగా ఉందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ...... ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ,చేయూత,విద్యాదీవెనలను అడ్డుకుంది.తెలంగాణా రాష్టంలో ఈసి పనితీరును బేరీజు వేస్తే ఏపిలో ఎన్నికల కమీషన్ తీరు సరిగా లేదు. పథకాలు అడ్డుకోవడం వలన ప్రజలు ఇబ్బందులను ఈసీ అర్ధం చేసుకోవాలి.విద్యాదీవెన,చేయూత,ఇన్ పుట్ సబ్సీడిలు ఈ రోజు తీసుకొచ్చిన పధకాలు కాదు...అయినా కూడా ఎన్నికల కోడ్ పేరుతొ కావాలని ఆపేసారు.తెలంగాణ లో కోడ్ వర్తించదా..అక్కడ ఒక కోడ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కోడ్ ఉంటుందా..ఇది కూటమి కుట్రలో భాగంగా కనిపిస్తున్నట్లుగా ఉంది.బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని... చంద్రబాబుకి అనుకూలంగా ఈసీ పని చేస్తోంది.ఇలాంటి నిర్ణయాలతో ఈసీ పై ప్రజల్లో నమ్మకం పోతుంది..చంద్రబాబుని అధికారంలోకి తెచ్చేలా ఈసీ పనితీరు ఉంది. విద్యాదీవెన విషయంలో ఈసీ నిర్ణయంతో రాష్టంలో sc st bc, మైనారిటీ, అగ్రవర్ణాలలోని పేద విద్యార్థులకి నష్టం కలుగుతుంది.ఈసీ నిర్ణయంతో రాష్టంలో 7 లక్షల మంది రైతులకి ఇన్ పుట్ సబ్సిడీ అందడం లేదు.పెన్షన్స్ విషయంలో కూడా చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహారించాడు.90 మంది వృద్ధుల మరణానికి కారణం అయ్యారు.ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కోసం ఈసీ పని చేయకూడదు.ఓటమి ఖాయం అవడంతో 15 రోజుల నుండి జగన్ గారిపై తప్పుడు ప్రచారాలు చంద్రబాబు చేస్తున్నాడు.ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది మోడీ..కానీ చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు జగన్ మీద అసత్య ప్రచారం చేస్తున్నారు.ఎన్నికలలో టిడిపి కూటమి నాటకాలకు ప్రజలు చెక్ పెడతారు.మోడీ పక్కన కూర్చున్న చంద్రబాబు,పవన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు.అది నల్లచట్టం అని ఎందుకు చెప్పలేకపోయారు.ఆ దమ్ము,ధైర్యం వారికి లేవా.ఆయా పార్టీలకు అధినాయకులుగా ఉండి ప్రజలను మోసం చేయడానికి సిగ్గనిపించడం లేదా.చంద్రబాబు 2014 లో ఇచ్చిన ఒక్క హామీ నేరెవర్చలేదు అందుకే 2019 లో ప్రజలు బుద్ది చెప్పారు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa