పేదలకు సంక్షేమ పథకాలు అందడం టీడీపీకి, చంద్రబాబుకు ఇష్టం లేదని వైయస్ఆర్‌సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు. లబ్దిదారులకు డీబిటీ ద్వారా పథకాలు ఇస్తాం అంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాల నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని శేషు కోరారు. ఓట్లకోసం కల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. పేదలకు పథకాలు అందడం టీడీపీకి,చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. పథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్ చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారని ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ ను చంద్రబాబు ఓ ప్రహాసనంగా మార్చారు. కాపులు ఎదగడం పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ఇష్టం లేదన్నారు. కాపుల్లో ఎదిగిన ముద్రగడ ,వంగవీటి మోహన రంగా కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa