గ్రామాల అభివృద్ధే తన ధ్యేయమని , అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలోని గ్రామాలన్నంటినీ అభివృద్ధి చేస్తానని కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. అనంతపురం , బత్తలపల్లి మండలకేంద్రంతో పాటు పోట్లమర్రి, వేల్పుమడుగు గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థికి కమలం గుర్తుకు, ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. అధికారంలోకి రాగానే గ్రామాల్లో సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగోనుగుంట్లవిజయ్‌కుమార్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ప్రచారంలో ధర్మవరం పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు మిరియాల అంజి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఇక తాడిమర్రి మండలం మరువపల్లి, తాడిమర్రిగ్రామాల్లో సత్యకుమార్ ఇంటింటాప్రచారం చేపట్టారు. మరువపల్లి గ్రామంలో చింతల వన్నూర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందకుటుంబాల వారు వైసీపీని వీడి బీజేపీలోకి చేరారు. కిశోర్, శంకర్‌రెడ్డి తదితరులు తమ అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సత్యకుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తాడిమర్రిలో రోడ్‌షో చేపట్టారు. కూటమిని గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa