దేవినేని ఉమకు తనకు గత కొంత కాలంగా రాజకీయ వైరం ఉందని, అది అందరికీ తెలిసిందేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పార్టీ అధిష్టానం, అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మేరకు తాను నడుచుకుంటున్నానని తెలిపారు. సాక్షి పత్రికలో తనపై ప్రతిరోజు రోజు వండి వార్చుతున్న తప్పడు కథనాలతో పాటు.. జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటున్న షర్మిల చేస్తున్న ఆరోపణల గురించి కూడా రాస్తే అప్పుడు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని ఎద్దేవా చేశారు.వైఎస్ మరణానికి కారణం రిలయన్స్ సంస్థ అని, వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి కారణం చంద్రబాబు అని, తనపై సీబీఐ, ఈడీ తప్పుడు కేసులు పెట్టారని జగనన్న చెప్పాడంటూ చెల్లి షర్మిల ఒకనాడు ఉరూరా తిరిగి చెప్పారని గుర్తుచేశారని కృష్ణ ప్రసాద్ ప్రస్తావించారు. ఈరోజు అదే చెల్లెలు జగనన్న పచ్చి మోసగాడు, దొంగ, హత్యలు చేయిస్తాడు, అబద్దాలు చెబుతాడు, అంటూ గొంతెత్తి అరుస్తుంటే సాక్షి పత్రికలో ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. జగన్ ఇద్దరు వ్యక్తుల చేతిలో కీలుబొమ్మ అని షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు సాక్షిలో ఎందుకు రాయడం లేదని ఆయన నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa