రాష్ట్రంలో అవినీతి వైసీపీ పాలనకు అంతం పలకాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం , ఓబుళదేవరచెరువు మండలకేంద్రంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో కలిసి రోడ్డుషో చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆకుతోటపల్లి వరకు కొనసాగింది. రోడ్డుషోలో పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అవినీతి, అరాచక పాలన సాగిందన్నారు. అలాంటి పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా పల్లె సింధూరను, ఎంపీగా పార్థసారధిని గెలిపించాలని కోరారు. పల్లె సింధూర మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత వారు ఆకుతోటపల్లి, వేమారెడ్డిపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇందులో జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పాల్గొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సింధూరను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇనచార్జి పత్తి చంద్రశేఖర్, కూటమి నాయకులు జయచంద్ర, పిట్టా ఓబులరెడ్డి, ఎద్దుల ప్రమోద్‌కుమార్‌రెడ్డి, పిట్టా ప్రభాకర్‌రెడ్డి, తుమ్మల మహబూబ్‌బాషా, జెరిపిటిఆంజనప్ప, పీట్ల సుధాకర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa