ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘టిక్కెట్ ఇస్తా.. ఖర్చులు మొత్తం నేనే భరిస్తా.. నా పార్టీ తరుపున పోటీ చేయాలని జగన్ ఒత్తిడి తెచ్చినా నేను పోటీ చేయలేదు. దీంతో తన సొంత పేపరు సాక్షిలో జగన్ ప్రతి రోజు నాపై ఎదో ఒక తప్పుడు కథనం రాయిస్తున్నారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి అనేక అవినీతి అక్రమాలు చేశానంటూ అసత్య కథనాలు వండి వార్చారు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా. నేను గనుక అక్రమాలు, అవినీతికి పాల్పడి ఉంటే ఏ విచారణకైనా సిద్ధం?.. మీరు సిద్ధమా?’’ అంటూ వసంత సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa