ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి.వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందుతారు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యూపీఐ,నో-కాస్ట్ ఈఎంఐలపై తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్‌లో మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్‌తో పాటు పలు రకాల ఉత్పత్తులుంటాయి.ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందింస్తుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక సేల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తేనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa