వైసీపీ పాలనలో ఆంధ్రరాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడిందని, అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రూరల్ మండలం కొంతమూరులో గ్రామకమిటీ అధ్యక్షుడు దండమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన బీజేపీ శ్రేణులు కలిపి గ్రామంలో జంగాలకాలనీ, కళ్యాణ్‌నగర్, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగన్‌రెడ్డి కబంద హస్తాలలో నలిగిపోతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, సంక్షేమం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబునాయుడును సీఎం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు తెలుగుదేశం-సైకిల్ గుర్తుపైనా, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ - కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దండమూడి ప్రసాద్, మత్యేటి ప్రసాద్, మార్ని వాసు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, దంటు విష్ణుమూర్తి, బొప్పన నానాజీ, కురుకూరి కిషోర్, దుద్దుపూడి రమేష్, ఉండవిల్లి బంగార్రాజు, గోక శ్రీను, బేసే నటరాజు, దండమూడి శ్రీహరి, సలీమ్, ఖాసిం, సయ్యద్ ఉమర్, వేమగిరి రాజు, యామన చిన్న, ఆకుమూరి అప్పన్న, అంగర రాజు, ఉల్లింగల శివ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa