ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్థుల కేసులో విచారణ జరుగుతోందని.. అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ తరుఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గతంలో కూడా విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతించిందని తెలిపారు. ఇరు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో తీర్పును ఈ నెల 14 కు సీబీఐ కోర్ట్ వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa