ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు. డ్వాక్రా సంఘాలు మేము అధికారంలోకి వచ్చే సమయానికి దెబ్బతిన్నాయని.. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలలో కోటి పదిహేను లక్షల మందికి సభ్యుల సంఖ్య పెరిగిందని.. ఇది ఆల్ ఇండియా రికార్డ్ అని పేర్కొన్నారు. వైయస్ జగన్ వచ్చిన తరవాత డ్వాక్రా గ్రూపులు పెరిగాయని.. సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించామని చెప్పారు. 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa