ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ పార్టీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎలా చేతులు కలిపారు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయమని, మైనార్టీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమను కురిపిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు.దాదాపు రూ.14,165 కోట్ల చెల్లింపులకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని జగన్ అన్నారు.న్డీయే కూటమి కుట్రలు, ఒత్తిళ్ల వల్లే ఎన్నికల సంఘం వాటికి అనుమతి ఇవ్వలేదని జగన్ విమర్శించారు.రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి అమలులో ఉన్న సంక్షేమ పథకాల చెల్లింపునకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వకపోవడానికి ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలే కారణమని ఆరోపించారు.ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే మరో ఐదేళ్లు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ఓటేయకుంటే చంద్రబాబు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ఆపేస్తారని జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa