కళ్యాణదుర్గం పట్టణంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ బూత్ లు ఏర్పాటు చేయకపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం అధికంగా ఉందని పట్టణ ప్రజలు ఆదివారం విలేఖరులకు తెలిపారు. ప్రధాన కూడలి అయిన టీ సర్కిల్ నందు డ్రమ్ములే ట్రాఫిక్ బూత్ గా ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పలుమార్లు పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేసిన వారు పట్టించుకోవడం లేదన్నారు. ట్రాఫిక్ పోలీసులు వేసవికాలంలో ట్రాఫిక్ బూత్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
![]() |
![]() |