చినగంజాం మండలం పరిధిలోని రొంపేరు కాలువ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం బైక్, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |