వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అవరోధాలే తప్ప అభివృద్ధి లేదని, ప్రజలకు ఈ ఎన్నికలే సరైన అవకాశమని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజా కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం రోజు ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో వారికి ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లపాటు అనేక సమస్యలతో సతమతమై ఇబ్బందులు పడ్డ ప్రజలంతా భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు అనే వజ్రాయుధంతో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. యువ ఓటర్లంతా బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించి విజన్ ముందుచూపు కలిగిన నేతలకు ఓట్లు వేసి ఎన్నుకోవాలన్నారు.
అపార అనుభవం కలిగిన చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్నారు ప్రజా కూటమి ఎవరు ఊహించని విధంగా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. పర్చూరు నియోజకవర్గాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో రెండు పర్యాయాలు విజయం సాధించానని, ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు తనకు శ్రీరామరక్ష అన్నారు.
![]() |
![]() |