ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా నేడు పులివెందులకు వెళ్లనున్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈరోజు బయల్దేరనున్నారు. ఇవాళ, రేపు పులివెందులలోనే ఉంటారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్య ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రచారంతో ముగింపు పలికారు.