శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఆదివారం ఆయన పలు విషయాలను తెలిపారు. రీ-పోలింగ్‌కు అవకాశం లేకుండా సార్వత్రిక ఎన్నికలలో హింసకు తావులేకుండా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.