ఆముదాలవలస మండలం అక్కులపేట జంక్షన్ వద్ద ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సమితి అక్కులపేట, వేణంపేట వారిచే మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున పాదచారులకు, వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.