ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భద్రతా పరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంది. పోలింగ్ ప్రారంభం కావడంతో, పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా టెంట్లు, మంచినీటి సౌకర్యాలను ఈసీ ఏర్పాటు చేసింది.