మొదటగా వైసీపీ అధినేత జగన్ పులివెందుల నియోజకవర్గంలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మండల పరిషత్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం నంబరు 16లో ఓటు వేశారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామి కాలనీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆయన ఓటు వేయనున్నారు.