సీతానగరం మండలం లక్ష్మీపురానికి చెందిన ముసలినాయుడు (24)తెలంగాణలోని రామగుండంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం సొంత గ్రామంలో ఓటేసేందుకు ఆయనతో పాటు స్నేహితులను డ్రాప్ చేయడానికి వరంగల్ బస్టాండ్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాయితో పాటు స్నేహితులను ట్రిప్పర్ ఢీకొంది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి, తల్లి, చెల్లి కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు.