బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన మీసాల తులసీరావు, మజ్జి సూర్యనారాయణ వద్ద రెండు లక్షల 20 వేల రూపాయలు నగదు ఫ్లయింగ్ స్క్యాడ్ ఏవో సిహెచ్ ధనలక్ష్మి శనివారం జియ్యన్నవలస వద్ద పట్టుకున్నారని బొండపల్లి ఎస్. ఐ కె. లక్ష్మణరావు చెప్పారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పాటు వైసీపీకి చెందిన ఓటరు నమోదు పత్రాలు, ఓటరు జాబితా స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేసామన్నారు.