జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో ఈనెల 25న లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అగా రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి వహీద్ ఉర్ రెహమాన్‌కు మధ్య మాత్రమే పోటీ నెలకొంది. స్థానికులు 3 దశాబ్దాల్లో తొలిసారిగా హింసాత్మక బెదిరింపులకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటం విశేషం.