ఆత్మకూరు పట్టణ శివార్లలోని జంబులా పరమేశ్వరీ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి మంగళవారం ప్రీతికరం కావడంతో ప్రత్యేక అలంకరణ గావించి సాంప్రదాయబద్దంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాకుండా ఆలయ ఆవరణలోని నాగుల కట్ట, లక్ష్మీదేవి తదితర దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa