ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ వైఖరితో అక్కడ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచిత్రమైన నిబంధనలు, కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయనే నిర్ణయిస్తారు. ప్రజలు ఏం తినాలి.. ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనేది నియంతే శాసిస్తారు. ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానాలు, శిక్షలు విధిస్తుంటారు. తాజాగా, మహిళలు పెదవులకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ పూసుకోవడంపై నిషేధం విధించారు. రెడ్ లిప్‌స్టిక్‌ను పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా కిమ్ రాజ్యం భావిస్తోంది. అంతేకాదు, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని బలమైన నమ్మకం. ఇప్పటికే ఉత్తర కొరియాలో మహిళల మేకప్‌పై నిషేధం కొనసాగుతోంది.
మహిళల అలంకరణ పాశ్చాత్య సంస్కృతి అని, వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పశ్చిమ దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారనేది కిమ్ భయం. ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని ప్రచారం చేస్తోంది కిమ్ ప్రభుత్వం. లిప్‌స్టిక్ వేసుకోవడం తమ దేశ నియమాలకు విరుద్ధమని అక్కడి పాలకుల అభిప్రాయం. ఇక, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక ఫ్యాషన్లపై ఉత్తర కొరియాలో నిషేధం అమల్లో ఉంది. బిగుతుగా ఉండే దుస్తులు, నీలిరంగు జీన్స్, ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్ కట్‌లపై నిషేధం విధించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే జుట్టును కత్తిరించుకోవాలి. అంతేకాదు, కిమ్ వస్త్రధారణ, అతడిలో జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. ఆయనను ఎవరైనా అనుకరిస్తే కఠిన శిక్షలు విధిస్తారు అధికారులు. ఒక్కోసారి భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి. కర్మగాలి జీన్స్ ధరించి రోడ్డుపై కనిపిస్తే.. ఇక అంతే సంగతి. అక్కడే నిలబెట్టి వేసుకోవడానికి వీల్లేకుండా కత్తిరిస్తారు.
ఇక, కిమ్‌ని లైంగిక వాంఛలను తీర్చడానికి అందమైన అమ్మాయిలతో కూడిన ఓ ‘ప్లెజర్ స్వ్కాడ్’ అనే గ్రూపు ఉంటుందని ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏటా అందమైన 25 మంది కన్వత్వం కలిగిన అమ్మాయిలను కిమ్ ఎంచుకుంటారని ఆ దేశం నుంచి తప్పించుకుని వచ్చిన యోన్మీ పార్క్ అనే మహిళ బయటపెట్టింది. మహిళల రూపం, రాజకీయ విధేయత ఆధారంగా ఎంపిక చేస్తారని తెలిపింది. ఈ స్క్వాడ్ స్కూళ్లకు వెళ్లి అందంగా ఉన్నవారిని తీసుకొచ్చి.. వారి కుటుంబ, రాజకీయ స్థితి గురించి ఆరాతీస్తారు.