కృష్ణా జిల్లా, పోరంకిలో టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైయస్ఆర్సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.