కంబదూరు మండలం ఎగువపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో తల్లి సుంకమ్మను కొడుకు వెంకటేశులు సుత్తితో కొట్టి దారుణ హత్య చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎగువపల్లి గ్రామంలో తల్లి కొడుకుల మధ్య వాగ్వివాదం జరిగి సుత్తితో కొడుకు తల్లి సుంకమ్మ తలపై బాధటంతో అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.