రాజీ చేయదగ్గ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సులువుగా పరిష్కరించవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. శ్యాంబాబు పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవ సదన్ కోర్టు ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కోర్టు భవనంలో మంగళవారం మధ్యవర్తిత్వంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యాయవాదులకు, మధ్యవర్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు.