పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.