ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు యంత్రాంగం జాగ్రత్త వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 07:54 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. పోలింగ్ అనంతరం ఏపీలో నెలకొన్న హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలని కోరారు. జూన్ 4న ఎన్నికల్లో వచ్చే ప్రజాతీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని నాగబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com