ఆదిశంకరాచార్యుని జయంతి వేడుకలను చిలమత్తూరు మండల బ్రాహ్మణ సంఘం నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. అద్వైత వేదాంత సిద్దాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంత వేత్త అని బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. అటువంటి మహాత్యుని జయంతి వేడుకలను ప్రతి హిందువు జరుపుకోవాలన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. సమాజ హిత కోసం ఆయన కృషి వెలకట్టలేనిదన్నారు.