18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఒక డోసు బీసీజీ వ్యాక్సిల అందజేస్తున్నట్లు సత్య సాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మంజు వాణి తెలిపారు. బుధవారం ఆరోగ్య శాఖ సిబ్బందితో ఆమె మాట్లాడుతూ పెద్దలలో టీబీ నివారించడానికి బీసీజీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ వాక్సిన్ వేసుకోవడం వలన ముందస్తు గా బీపీ, షుగర్, టీబీ వ్యాధులను అరికట్టవచ్చు అని తెలిపారు. 18 పైన ఉన్న ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.