అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి నెల్లూరు వెళ్తున్న కారు చిన్న కొత్తపల్లి వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని క్రాస్ చేసే క్రమంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa