ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోగి రమేష్ వలస పక్షి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 02:12 PM

జోగి రమేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసిన టీడీపీ నాయకులు నిలబడ్డారని బోడె ప్రసాద్ అన్నారు. తనకు సీటు కేటాయిస్తే ఆయన బాణాసంచులు, మిఠాయిలు పంచారని... ఆయనకు మతి భ్రమించిందని బోడె ప్రసాద్ అన్నారు. ‘‘మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి హడావిడి చేశారు. బట్ట అనిల్, కొత్తపల్లి రాజేష్, నరగాని అశ్విన్ అనే రౌడీ షీటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. పెనమలూరు స్టేషన్‌లో సీఐ, సిబ్బంది అందరూ విఫలమయ్యారు. పోరంకి టీడీపీకి కంచుకోట. పోరంకిలో కావాలనే గంట పాటు పోలింగ్ నిలిపివేసి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన వ్యక్తులను పోలింగ్ కేంద్రం గేట్ ముందు నిలబడ్డారు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. మా మీద 3 కేసులు పెట్టారు. జోగి రమేష్ నేరుగా అల్లర్లుకు పాల్పడితే అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. జోగి రమేష్ వలస పక్షి, ఎన్నికల ఫలితాలు తరువాత అడ్రస్ ఉండడు. జోగి రమేష్‌ని చూసుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు వడ్డీతో సహా చెల్లిస్తాం.. జోగి రమేష్ పోరంకిని స్వాధీనం పరుచుకున్నానని వీర్రవీగుతున్నారు. ఇది ఏమైనా రాజుల రాజ్యమా.. ప్రజాస్వామ్యంలో స్వాధీనం చేసుకోవడం ఏంటి..? నా వెంట్రుక కూడా పీకలేరు.. నీ తరం కాదు నీ అబ్బా తరం కాదు. నేను ఏనాడూ జోగి రమేష్ మీద నోరు జారలేదు. జోగి రమేష్ కు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది. జూన్ 4 తర్వాత గేమ్ మొదలవుతుంది. మా కార్యకర్తలను అదుపులో ఉంచుకున్నాం కాబట్టే జోగి రమేష్ పోరంకి దాటి వెళ్లారు. పెనమలూరు సీఐ పూర్తిగా విఫలం అయ్యారు. 20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు. టీడీపీ కూటమి 100 శాతం అధికారం చేపడుతుంది’’ అని బోడె ప్రసాద్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa