శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండల పరిధిలోని కొటిపి గ్రామ సమీపంలో గుర్తుతెలియని సుమారు 50 సంవత్సరములు గల వ్యక్తి మృతిచెందినట్లు హిందూపురం రూరల్ సీఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. అయితే ఇది సాధారణ మరణమే అయిఉంటుందని, ఈ ప్రాంతానికి చెందినవాడుకాదని తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa